Thursday, June 19, 2014

అరుణతార

ఈ నెల పత్రిక పరిచయం “అరుణతార”

ఒక సాహిత్య పత్రికగా 275 సంచికలు వెలువడడం మాటలు కాదు. అందులోనూ విప్లవ స్ఫూర్తి నిబద్దతలతో వెలువడుతున్న అరుదైన సాహితీ మాస పత్రిక “అరుణతార”. ఈ మాసపు పత్రికగా అలోచనను పంచే, పెంచే “అరుణతార” పత్రికను పరిచయం చేసుకుందాం. విప్లవ రచయితల సంఘం (విరసం) అధికార పత్రిక “అరుణతార” తాజాగా వెలువరించిన 275వ సంచిక మార్చి – మే 2009 తేదీతో ప్రత్యేక సంచికగా వెలువడింది. మహా రచయిత పతంజలి మీక కొన్ని ప్రత్యేక వ్యాసాలతోపాటు ‘మహిళాతేజం’ ప్రత్యేక శీర్షికతో మరికొన్ని పరిచయ, సంస్మరణ వ్యాసాలున్నాయి. అసలు పుస్తక సమీక్ష అంటే అర్థం మారిపోయిన సందర్భంలో ప్రొఫెసర్ ఆర్. ఎస్. రావు ప్రత్యేక ఆర్థిక మండలాల మీద రాసిన వ్యాసం సమగ్ర పుస్తక సమీక్ష ఎలా వుండాలో చెప్పేదిలా వుంది.
ఇవికాక ప్రతి సంచికలోనూ కథలు, కవిత్వం, పుస్తక పరిచయాలు, వ్యాసాలు తప్పకుండా వుంటాయి. అదికాక ఇటీవల పాణి ‘గుమ్మెటమోత’ సీరియల్ ప్రారంభించారు. సీరియస్ గా సాహిత్యాన్ని చదివే ప్రతి పాఠకుడు తప్పక తెప్పించుకోవాల్సిన పత్రిక “అరుణతార”. ఎందుకు తెప్పించుకోవాలంటే ఈ పత్రిక విడిగా మార్కెట్లో, పత్రికల స్టాల్లో దొరకదు కనక. కేవలం 100 రూపాయల సంవత్సర చందా కట్టి ప్రతి సంచికనూ ఇంటికే తెప్పించుకునే సదుపాయముంది కనుక, అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు.
పైగా బ్లాగులు చదివే మిత్రులందరికీ విన్నవించుకునేదేమంటే, ప్రత్యామ్నాయ పత్రికలకు చందా కట్టడం వాటికి ప్రాణం పోయడమే. మెయిన్ స్ట్రీమ్ పత్రికలకు రకరకాల రూపాలలో ఆర్థిక వనరులు సమకూరుతాయి. విరాళాలు, ప్రకటనలు, సంవత్సర చందాలు, ఇంకా పాట్రన్ లు వాటికి వుంటారు. కానీ ప్రత్యామ్నాయ పత్రికలు బతికేది కేవలం పాఠకులు చందా కట్టడం వలన మాత్రమే.  మరింత మంది మిత్రులచేత చందా కట్టించడం వల్ల మాత్రమే.
“అరుణతార”కు చందా పంపవలసిన చిరునామా: ఎస్. రవికుమార్, 5-1307, దొరసానిపల్లె రోడ్, ప్రొద్దుటూరు, కడప జిల్లా – 516360. మొబైల్ నెంబరు: 9866021257
http://chaduvu.wordpress.com/2009/09/01/mag03/

0 comments:

Post a Comment