Sunday, August 24, 2014

ఆంధ్రభూమి

ఆంధ్రభూమి సచిత్ర వారపత్రిక

వికీపీడియా నుండి
ఆంధ్రభూమి సచిత్ర వారపత్రిక
నిడివిWeekly
మొదటి సంచిక1977
కంపెనీదక్కన్ క్రానికల్ గ్రూప్
భాషతెలుగు
ఆంధ్రభూమి సచిత్ర వారపత్రిక 1977 సంవత్సరంలో ప్రారంభించబడినది.యాజమాన్యం దక్కన్ క్రానికల్ హోల్డింగ్స్ లిమిటెడ్ అనే ప్రైవేటు సంస్థ చేతిలోవుంది. 

కొన్ని శీర్షికలు

  • సంపాదకీయం : ఎ.ఎస్.లక్ష్మి
  • మనకి 'లా" : రాజేందర్ మంగారి
  • జోక్ బాక్స్ : సత్యమూర్తి
  • అడల్ట్స్ ఓన్లీ కథ
  • ఆలోకనం : వి.యస్.రమాదేవి
  • పవర్ పాలిటిక్స్
  • ముత్యాల ముగ్గులు
  • ఎ.బి.సి. (ఆంధ్రభూమి సినిమా) పజిల్
  • చూడాలనివుంది : పడక్కుర్చీలో ప్రపంచయానం
  • ఆలయ దర్శనం
  • అదిగో దెయ్యం : దుర్గాప్రసాద్ సర్కార్
  • అందరికీ ఆరోగ్యం
  • గ్రహవాణి
  • బుక్ రివ్యూ
  • గడినుడిగుంచం : నిశాపతి

ఆంధ్రజ్యోతి

ఎబిఎన్ ఆంధ్రజ్యోతి : ఇది ఒక తెలుగు టెలివిజన్ వార్తా చానెల్. ఆంధ్ర బ్రాడ్‌కాస్టింగ్ న్యూస్ సర్వీస్ అనే సంస్థ ద్వారా నిర్వహించబడుతుంది. ఈ ఛానెల్ అక్టోబర్ 152009 నుండి తన ప్రసారాలను ప్రారంభించింది. దీనికి "ఆంధ్రజ్యోతి" దినపత్రిక మాతృసంస్థ. ఈ ఛానెల్‌కు వేమూరి రాధాకృష్ణ కార్యనిర్వాహక అధికారి. ఈ చానెల్ పొందుటకు సాంకేతిక వివరాలు ఈ క్రింద పేర్కొనబడినాయి.
ఉపగ్రహం - Ins Insat 2E, డౌన్‌లింక్ పౌనపున్యం- 3656 MHZ, FEC 3/4, Symbol rate - 13,330 మరియు polarization - vertical
ఆంధ్రజ్యోతి
ఒక ప్రముఖ తెలుగు దినపత్రిక. ప్రఖ్యాత సంపాదకుడు, హేతువాది అయిన నార్ల వెంకటేశ్వరరావు, ఔత్సాహిక పారిశ్రామికవేత్త కె.యల్.ఎన్.ప్రసాద్మరికొందరు మిత్రులతో కలసి ఆంధ్రా ప్రింటర్స్ లిమిటెడ్ పక్షాన1960 జూలై 1న ఈ పత్రికను విజయవాడలో ప్రారంభించారు. అప్పటి ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య అధ్యక్షత వహించిన సభలో కేంద్ర సమాచార శాఖ మంత్రి బి.వి.కేస్కర్ పత్రికను ప్రారంభించారు. నాలుగు ఎడిషన్లుగా ప్రచరించబడింది. 2000లో ప్రచురణ నిలిచిపోయింది. 2002 లో కొత్త యాజమాన్యంతో వేమూరి రాధాకృష్ణ సారధ్యంలో తిరిగి ప్రచురణ మొదలైంది. ఈ పత్రికకు అనుబంధంగా నవ్య వారపత్రిక, ఆంధ్రజ్యోతి జర్నలిజం పాఠశాలఎబిఎన్ ఆంధ్రజ్యోతి టివి ఛానల్ నడుపబడుతున్నాయి.


1960-2000


ఆంధ్రజ్యోతి మొదటిపేజీ 1961, ఆగష్టు,1
మొదట నార్ల తో విద్వాన్ విశ్వం, నండూరి రామమోహనరావు సహాయ సంపాదకులుగా పనిచేశారు. ఆ తరువాత సంపాదకులుగా పనిచేసినవారిలో ముఖ్యులు నండూరి రామమోహనరావు ,తుర్లపాటి కుటుంబరావు, పురాణం సుబ్రహ్మణ్యశర్మ . 1976లో నార్ల ఛీఫ్ ఎడిటర్ గా, నండూరి రామమోహనరావు ఎడిటర్ గా నియమితులైనారు. 1977 ఎన్నికల తరువాత నార్ల సంపాదకత్వ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. నండూరి వారు సంపాదకత్వం స్వీకరించాడు.నండూరి రామమోహనరావు పదవీ విరమణ చేసిన తరువాత ఐ.వెంకట్రావు సంపాదకులైనారు. 2000 సంవత్సరాంతంలో ఆంధ్రజ్యోతి మూతపడినది.

2002 అక్టోబర్ 15 న పాత పత్రికలో సీనియర్ రిపోర్టర్ గా పనిచేసిన వేమూరి రాధాకృష్ణ మేనేజింగ్ డైరెక్టర్ గా , కె.రామచంద్రమూర్తి సంపాదకులుగా 9 ప్రచురణ కేంద్రాలతోఒకేసారి తిరిగి ప్రారంభించబడినది. తరువాత 18 ప్రచురణ కేంద్రాలకు విస్తరించబడింది. 2008నుండి కె.శ్రీనివాస్ సంపాదకుడిగా వున్నాడు. వేమన వసంత లక్ష్మి, నవ్య అనుబంధం మరియు ఆదివారం అనుబంధం ఫీచర్ సంపాదకులుగా,జగన్ ఆన్లైన్ సంపాదకునిగా, పురంధరరావు సీనియర్ అడ్వర్టైజ్మెంట్ మేనేజర్ గా వున్నారు.

భాష

ఆంధ్రజ్యోతి శైలి, అన్న ప్రచురణ ఈ పత్రిక యాజమాన్యం ప్రచురించింది.

శీర్షికలు, విశిష్టతలు

వారంవిశిష్టత
ప్రతిరోజునవ్య, 
ఆదివారంఆదివారం అనుబంధం 
సోమవారంవివిధ సాహిత్య వేదిక
మంగళ వారందిక్చూచి (విద్య,ఉద్యోగావకాశాల ప్రత్యేకం) 
బుధవారం (?)సకల
గురువారం(?)చింతన
శుక్ర వారం(?)వైద్యం 
శనివారం (?)సంస్కృతి 

ప్రముఖ కాలమిస్టులు[మార్చు]

శీర్షికకాలమిస్టుప్రచురణ వారం, విషయాలు
సందర్భంకె. శ్రీనివాస్వార్తావిశ్లేషణ
దీప శిఖ రాజ్ దీప్ సర్దేశాయ్శుక్రవారం, వార్తావిశ్లేషణ
పత్రహరితం మేనకా గాంధీజీవకారుణ్యం
సమాంతరంసుధీంధ్ర కులకర్ణి
భరత వాక్యం భరత్ ఝన్ ఝన్ వాలావార్తా విశ్లేషణ
గతానుగతం రామచంద్ర గుహచారిత్రాత్మక విశ్లేషణ
గమనంతెలకపల్లి రవివార్తా విశ్లేషణ
ఇండియాగేట్ఎ కృష్ణారావుజాతీయ వార్తా విశ్లేషణ
కొత్త పలుకు]వేమూరి రాధాకృష్ణ
గతంలో ప్రాణహిత శీర్షికనఅల్లం నారాయణ తెలంగాణ వాదం విశ్లేషించారు.

ఆన్ లైన్ రూపాలు

ఆన్లైన్ సంచిక వివిధరూపాల్లో లభ్యమవుతున్నది.
  • హెచ్టిఎమ్ఎల్ పాఠ్యం రూపంలో ఇంటర్నెట్ లో ఆంధ్రజ్యోతి అందుబాటులో వున్నది. మొదట్లో స్వంత ఖతి "శ్రీ తెలుగు" వుపయోగించిన తరువాత ప్రామాణిక యూనికోడ్ కి మార్చబడింది. పాత సంచికలు వెబ్సైట్ కొత్త రూపంతో అందుబాటులోలేవు
  • పిడీయఫ్
    ఈ పిడీయఫ్ ఆన్ లైన్ సంచికలో ఆంధ్రజ్యోతి పేపరుని అసలయిన పేపర్ లాగే ఉన్నది ఉన్నట్టుగా దిగుమతి చేసుకుని చదువుకోవచ్చు. కావలసిన వార్త మీద క్లిక్ చేస్తే ఆ ఎన్నుకున్న వార్తా భాగం పూర్తిగా ఇంకొక విండోలో కనిపిస్తుంది. గత పది రోజుల పేపరు మాత్రమే అందుబాటులో వుంటుంది.
  • 2007 నుండి ముఖ్య వ్యాసకర్తల వ్యాసాలుఇంటర్నెట్ లో అందుబాటులో వున్నాయి.

విమర్శలు

వైయస్స్ఆర్ ముఖ్యమంత్రిగా వున్నప్పుడు ప్రభుత్వ వ్యతిరేఖ పత్రికగా పేరు పొందింది.

http://www.andhrajyothy.com/


    Thursday, June 19, 2014

    రచన

    రచన (మాస పత్రిక)



    px300
    రచన ఒక తెలుగు మాసపత్రిక. తెలుగులో సాహిత్యంలో విలువలు కనుమరుగవుతున్న నేపథ్యంలో ఉత్తమ సాహిత్యాన్ని అందరికీ అందించాలన్న ఆశయంతో స్థాపించబడిన పత్రిక 'రచన'. దీని వ్యవస్థాపకులు మరియు ప్రధాన సంపాదకులు శ్రీ వై.వి.యస్.ఆర్.యస్. తల్పశాయి గారు.
    కథలు, కథానికలు, కార్టూన్లు, వివిధ శీర్షికలు 'రచన'లో కోకొల్లలు. సాహితీ విలవలు కలిగిన కథలు మాత్రమే ప్రచురించటం 'రచన' తాలూకు విశిష్టత. తతిమ్మా పత్రికల్లో కనబడే సినిమా కబుర్లు, గాసిప్ కబుర్లు, వెకిలి కార్టూన్లు 'రచన'లో మచ్చుకు కూడా కనబడవు. సందర్భాన్నిబట్టి చలంశ్రీశ్రీకా.రా.ముళ్ళపూడి వంటి రచయితల రచనలను గురించి 'రచన' ప్రత్యేక శీర్షికలు వెలువరిస్తుంది.
    ఎన్నారై రచయితలు 'రచన'లోని మరొక ప్రత్యేకత. చాలా పత్రికలు ఆంధ్రరాష్ట్రాన్ని దాటి తతిమ్మా దేశాలకు ముఖ్యంగా అమెరికా దేశానికి వాయుమార్గాన తమ సంచికలు చేరవేసినా, రచన ఎనారైలలో ప్రాముఖ్యత సాధించినట్లుగా అవేవీ ప్రాముఖ్యత సాధించలేకపోయాయి. రచనలో వివిధ శీర్షికలు, కథలు మున్నగువాటికి ఎన్నారైలు ఉత్సాహంగా తోడ్పడటం కద్దు.

    'రచన' మైలురాళ్ళు

    ఇది హైదరాబాదు నుండి వెలువడే మాసపత్రికకథలకి ప్రాధాన్యత. ఇది అంతర్జాలంలో దొరకదు. కానీ ప్రతి సంచికలోనుంచి కొన్ని పుటలను PDF రూపంలో ఈ పత్రిక official websites లో ఉంచుతారు. పూర్తిగా రచయితలే నిర్వహించే ఈ పత్రికను ప్రవాసాంధ్రులు ఎక్కువగా చదువుతారు. కథా సాహిత్యాన్ని ప్రోత్సహించే సాహితీ వైద్యం, కథాపీఠం, కథా ప్రహేళిక లాంటి శీర్షికలు ఈ పత్రికలో ఉన్నాయి. వీటిలో వసుంధర నిర్వహించే సాహితీ వైద్యం శీర్షిక కథా రచయితలు కా.గో.రే. ఔత్సాహికులకు ఉపయోగకరంగా ఉంటుంది.

    'రచన' శీర్షికలు

    • సాహితీ వైద్యం
    • కథా పీఠం
    • అమెరికాకమ కబుర్లు

    చిరునామా

    1-9-286/2/P, విద్యానగర్ (రాంనగర్ గుండు దగ్గర), హైదరాబాద్ - 500 044

    మిసిమి

    మిసిమి (English : Misimi) ఒక తెలుగు మాస పత్రిక. మేలైన సాహిత్య సంస్కృతీ పరమైన వ్యాసపరంపరలు ఆలోచింపజేసే కవితలను, కన్నులకు ఇంపైన చిత్ర - వర్ణ చిత్రాలను, రసానందాన్ని అందించే అరుదైన సంగీత, సాహిత్య పరిచయాలను, స్ఫూర్తి ప్రదాతలైన వ్యక్తుల జీవన విధానాన్ని వారి మాటలోనే తెలియజేస్తూ ప్రచురించే పత్రిక.

    చరిత్ర

    రవీద్రనాథ్ ఆలపాటి మిసిమి యొక్క సంస్థపక సంపాదకులు. ఆలపాటి బోపన్న గత ఇరవై సంవత్సరాల నుండి ప్రచురణకర్తగా ఉన్నారు.

    కార్య వర్గం

    ప్రధాన సంపాదకులు-చెనూరి ఆంజనెయ రెడ్ది.,
    సంపాదకులు-అన్నపరెడ్ది వెంకటెస్వర రెడ్ది.,
    సహాయ సంపాదకులు-లక్ష్మి రెడ్ది, ఈమని నాగి రెడ్ది,అబ్బురి గొపాల క్రిష్న,జయధీరీ తిరుమల రావు,కుర్రా జితెంధ్ర బాబు


    బొమ్మరిల్లు

    బొమ్మరిల్లు పిల్లల మాసపత్రిక, ప్రముఖ సినీ నిర్మాతా, దర్శకుడూ అయిన, శ్రీ విజయ బాపినీడు 1971లో స్థాపించారు. దాదాపు, చందమామ వరవడిలొనే కథలు ధరావాహికలు వచ్చేవి కాని భాష, కథా కథనం, కథల ఎంపిక చాలా వేరుగా ఉండేది. ఇందులో మొట్టమొదటి ధారావాహిక 'మృత్యులోయ'. బేతాళ కథలలాగున 'కరాళ కథలు' అని ఒక ధారావాహిక కూడా ప్రవేశపెట్టారు. పత్రికతో బాటు ఒక అనుబంధం కూడా ఇచ్చే పద్దతి ఈ పత్రికే మొదలు పెట్టింది. కొంతకాలం ఒక రిబ్బనులాంటి వెడల్పుగా చాలా బారుగా ఉన్న ఒక ప్రతిని ఇచ్చేవారు. తరువాత, ఒక చిన్న పుస్తకం ఇవ్వటం మొదలు పెట్టారు. ఆ చిన్న పుస్తకంలో ఓ కథ బొమ్మలతో వేసేవారు. శ్రీమతి గుత్తా విజయలక్ష్మి గారు 'కుందేలు కథలు' అనేకం (ఆంగ్ల కథలకు స్వేఛ్ఛానువాదం) ఈ చిన్న పుస్తకానుబంధం కోసం వ్రాసారు. చందమామకు దీటయిన పోటీనిచ్చింది ఈ పత్రిక.

    బాలమిత్ర

    బాలమిత్ర (Balamitra) తెలుగు బాలల సచిత్ర మాసపత్రిక. ఇది 1940లో మద్రాసు నుండి ప్రారంబించబడినది. చందమామ వలెనే రంగుల బొమ్మలతో, ప్రాచీన సాహిత్యం నుంచి తీసిన కథలతో ఆసక్తికరంగా ఉండేది. దీని వ్యవస్థాపక సంపాదకుడు బి.వి.రాధాకృష్ణ మరియు సహాయ సంపాదకుడు బి.ఆర్.వరదరాజులు. ఇది స్వర్ణోత్సవం జరుపుకున్న పత్రిక. ఇది ప్రస్తుతం తెలుగు మరియు కన్నడం భాషలలో ముద్రించబడుతున్నది.
    ప్రస్తుతం ఈ పత్రికలో ఎన్నో నీతిని బోధించే కథలు, ఆసక్తికరమైన విషయాలతో పాటు శ్రీ గురువాయూరప్ప వైభవం, రాజగురువు రహస్యం, గోల్డెన్ గొరిల్లా ధారావాహికలుగా అందిస్తున్నారు. ప్రతి నెల ఒక మినీ నవలను కూడా ఇస్తున్నారు.

    బాలభారతం(పత్రిక)

    బాలభారతం(పత్రిక)

    వికీపీడియా నుండి

    బాలభారతం తెలుగు పిల్లల మాసపత్రిక మొదటి సంచిక ముఖపత్రం,జూన్ 2013
    రామోజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పిల్లల కోసం వెలువడుతున్న మాసపత్రిక బాలభారతం 

    ప్రారంభం-ప్రస్థానం

    జూన్ 2013 లో తొలిసంచిక విడుదలైంది.

    శీర్షికలు-అంశాలు

    ఈ పత్రికలో ప్రధానంగా విజ్ఞానం, వినోదం, కళలు, సైన్సు, చరిత్ర, జీవిత చరిత్రలు, సమకాలీన అంశాలు మొదలైన అంశాలు ఉంటాయి.


    బాల (పత్రిక)

    తెలుగులో పిల్లల పత్రికలు రావడం 1940 లలో ప్రారంభమైన "బాల" తో మొదలయిందని చెప్పవచ్చు. రేడియో అన్నయ్యగా పిలవబడే న్యాయపతి రాఘవరావు ఈ పత్రిక వ్యవస్థాపకుడు మరియు సంపాదకుడు. వీరు 1945సంవత్సరంలో దీనిని మొదలుపెట్టారు.

    ఉదయం (పత్రిక)

    ఉదయం (పత్రిక)

    వికీపీడియా నుండి
    ఉదయం దినపత్రిక 1984 సంవత్సరంలో ప్రముఖ సినిమా దర్శకుడు, నిర్మాత, రచయిత దాసరి నారాయణరావు ప్రారంభించారు.
    ఉదయం పత్రికను తారక ప్రభు పబ్లికేషన్స్ సంస్థ ప్రచురించేది. దీనికి దాసరి నారాయణరావు ఛైర్మన్. రామకృష్ణ ప్రసాద్ మేనేజింగ్ డైరెక్టర్ గా ఉండేవారు. ఎ.బి.కె.ప్రసాద్ సంపాదకుడుగా కొద్ది సంవత్సరాలు పనిచేశారు. ఇదిహైదరాబాదు మరియు విజయవాడ నుండి ప్రచురించబడేది. ప్రసాద్ తరువాత కె.రామచంద్రమూర్తి, కె.ఎన్.వై.పతంజలి పత్రికను నిర్వహించారు.
    1991లో మాగుంట సుబ్బరామరెడ్డి ఉదయం పత్రికను కొన్నారు. గజ్జెల మల్లారెడ్డిపొత్తూరి వెంకటేశ్వరరావు, తరువాత కె.రామచంద్రమూర్తి ప్రధాన సంపాదకులుగా ఉన్నారు.
    కొన్ని ఆర్ధిక ఇబ్బందులు మరియు కార్మిక సమస్యలు తలెత్తి పత్రిక మూతపడినది.

    ప్రత్యేకతలు[మార్చు]

    • అప్పటికి అత్యధికంగా అనగా రెండు లక్షల కాపీలతో పత్రిక ప్రారంభమైనది.
    • ఉదయంలో సమాజంలో జరుగుతున్న అక్రమాలపై ప్రచురించబడిన కొన్ని 'ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం రిపోర్టులు' చాలా ప్రాచుర్యం పొందాయి.
    • హైదరాబాదు నగరం కోసం ప్రత్యేకంగా టాబ్లాయిడ్ ప్రచురించడం మొదలుపెట్టినది.
    • విద్యార్ధుల కోసం వెలువరించిన అనుబంధం "దిక్సూచి" చాలా ప్రసిద్ధమైనది.

    ఆంధ్రపత్రిక

    వికీపీడియా నుండి

    ఆంధ్రపత్రిక
    Andhrapatrika1947-8-15.jpg
    రకముప్రతి దినం దిన పత్రిక
    ఫార్మాటుబ్రాడ్ షీట్

    యాజమాన్యం
    సంపాదకులుకాశీనాథుని నాగేశ్వరరావు పంతులు
    స్థాపన1908-09-09(వారపత్రిక), 1914-04-01 (దినపత్రిక)
    నిర్వహణ ఆగిపోయిన1991
    వెలభారతదేశం రూపాయలు:
    సోమ వారం-శని వారం
    రూ. ఆది వారం
    ప్రధాన కేంద్రముముంబై(వారపత్రిక), చెన్నై(దినపత్రిక)
    ఆంధ్రపత్రిక స్వాతంత్రోద్యమంలో కీలకపాత్ర వహించిన పత్రిక. 1908 సంవత్సరం సెప్టెంబరు 9 తేదీన, తెలుగు కాలమానంలో కీలక నామ సంవత్సరం భాద్రపద శుద్ధ చతుర్థి హిందువులకు పండుగ దినమైన వినాయక చవితి నాడు కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు ఆంధ్రపత్రికను వారపత్రికగా ప్రారంభించారు. ఇది బొంబాయి లోని తత్వవివేచక ముద్రాక్షరశాలలో ముద్రించబడేది.
    1910 నుండి ఆంధ్రపత్రిక 'ఉగాది సంచిక'లను ప్రచురించడం మొదలుపెట్టింది. ఈ సంవత్సరాది సంచికలు ఎక్కువ పేజీలతో ప్రత్యేక వ్యాసాలు, ఇతర రచనలతో విలక్షణంగా ఎప్పటికీ దాచుకొనేవిగా ఉండేవి. మొదటి ఉగాది సంచికలో 248 పేజీలు 126 చిత్రపటాలు ఉన్నాయి. కేవలం ముద్రణకే రెండు నెలలు పట్టేదట. అప్పటి ప్రసిద్ధ రచయితలు, పరిశోధకులు, కవులు ఇందులో రచనలు చేశేవారు. సంవత్సరం మొత్తంలో జరిగిన రాజకీయ, సాంఘిక, సాంస్కృతిక సంఘటనలను ఇందులో ప్రస్తావించేవారు.
    1914 సంవత్సరంలో పత్రికను మద్రాసు కు తరలించారు. అదే సంవత్సరం ఆంధ్రపత్రిక దినపత్రికగా ఏప్రిల్ 1 వ తేదీన ప్రచురణ ప్రారంభమైనది. తెలుగు పంచాంగం ప్రకారం ఆనంద నామ సంవత్సరం చైత్ర శుద్ధ షష్ఠి నాడు ఆంధ్రదినపత్రిక జన్మించింది.
    నాగేశ్వరరావు తరువాత శివలెంక శంభుప్రసాద్ ఆంధ్రపత్రిక దిన, వార పత్రికలకు మరియు భారతి కి సంపాదకులైనారు. ఆయన కాలంలోనే హైదరాబాదు మరియువిజయవాడ లలో ఆంధ్రపత్రిక ఎడిషన్లు ప్రారంభమైనాయి.

    http://www.http://te.wikipedia.org/wiki/ఆంధ్రపత్రిక


    అరుణతార

    ఈ నెల పత్రిక పరిచయం “అరుణతార”

    ఒక సాహిత్య పత్రికగా 275 సంచికలు వెలువడడం మాటలు కాదు. అందులోనూ విప్లవ స్ఫూర్తి నిబద్దతలతో వెలువడుతున్న అరుదైన సాహితీ మాస పత్రిక “అరుణతార”. ఈ మాసపు పత్రికగా అలోచనను పంచే, పెంచే “అరుణతార” పత్రికను పరిచయం చేసుకుందాం. విప్లవ రచయితల సంఘం (విరసం) అధికార పత్రిక “అరుణతార” తాజాగా వెలువరించిన 275వ సంచిక మార్చి – మే 2009 తేదీతో ప్రత్యేక సంచికగా వెలువడింది. మహా రచయిత పతంజలి మీక కొన్ని ప్రత్యేక వ్యాసాలతోపాటు ‘మహిళాతేజం’ ప్రత్యేక శీర్షికతో మరికొన్ని పరిచయ, సంస్మరణ వ్యాసాలున్నాయి. అసలు పుస్తక సమీక్ష అంటే అర్థం మారిపోయిన సందర్భంలో ప్రొఫెసర్ ఆర్. ఎస్. రావు ప్రత్యేక ఆర్థిక మండలాల మీద రాసిన వ్యాసం సమగ్ర పుస్తక సమీక్ష ఎలా వుండాలో చెప్పేదిలా వుంది.
    ఇవికాక ప్రతి సంచికలోనూ కథలు, కవిత్వం, పుస్తక పరిచయాలు, వ్యాసాలు తప్పకుండా వుంటాయి. అదికాక ఇటీవల పాణి ‘గుమ్మెటమోత’ సీరియల్ ప్రారంభించారు. సీరియస్ గా సాహిత్యాన్ని చదివే ప్రతి పాఠకుడు తప్పక తెప్పించుకోవాల్సిన పత్రిక “అరుణతార”. ఎందుకు తెప్పించుకోవాలంటే ఈ పత్రిక విడిగా మార్కెట్లో, పత్రికల స్టాల్లో దొరకదు కనక. కేవలం 100 రూపాయల సంవత్సర చందా కట్టి ప్రతి సంచికనూ ఇంటికే తెప్పించుకునే సదుపాయముంది కనుక, అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు.
    పైగా బ్లాగులు చదివే మిత్రులందరికీ విన్నవించుకునేదేమంటే, ప్రత్యామ్నాయ పత్రికలకు చందా కట్టడం వాటికి ప్రాణం పోయడమే. మెయిన్ స్ట్రీమ్ పత్రికలకు రకరకాల రూపాలలో ఆర్థిక వనరులు సమకూరుతాయి. విరాళాలు, ప్రకటనలు, సంవత్సర చందాలు, ఇంకా పాట్రన్ లు వాటికి వుంటారు. కానీ ప్రత్యామ్నాయ పత్రికలు బతికేది కేవలం పాఠకులు చందా కట్టడం వలన మాత్రమే.  మరింత మంది మిత్రులచేత చందా కట్టించడం వల్ల మాత్రమే.
    “అరుణతార”కు చందా పంపవలసిన చిరునామా: ఎస్. రవికుమార్, 5-1307, దొరసానిపల్లె రోడ్, ప్రొద్దుటూరు, కడప జిల్లా – 516360. మొబైల్ నెంబరు: 9866021257
    http://chaduvu.wordpress.com/2009/09/01/mag03/